ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం గ్రామంలోని 2వ వార్డులో వైఎస్సార్సీపీ ఎంపీపీ చొక్కాపు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ చింతల సింహచలం నాయుడు, మండల ఉప అధ్యక్షులు డర్రు పైడిరాజు, మాజీ డైరెక్టర్ రాయల్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కనిమెరక అప్పారావు, పూడి సత్యం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.