ప్రమాదంలో గాయపడిన శంకర్రావును పరామర్శించిన జడ్పీ చైర్మన్

3చూసినవారు
ప్రమాదంలో గాయపడిన శంకర్రావును పరామర్శించిన జడ్పీ చైర్మన్
విజయనగరం ఎమ్మార్వో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శంబింగి శంకర్రావు విధులు ముగించుకుని బొబ్బిలికి వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వెంటనే స్పందించి ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :