సెప్టిక్ ట్యాంక్ వాహన రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

6చూసినవారు
సెప్టిక్ ట్యాంక్ వాహన రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం జిల్లాలో సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల కొనుగోలుకు సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు డి. వెంకటేశ్వరరావు తెలిపారు. దరఖాస్తుల గడువును అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. ఆసక్తిగల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్