బొద్దూరు సమీపంలో ఆటో ప్రమాదం.. 10 మందికి గాయాలు

2చూసినవారు
బొద్దూరు సమీపంలో ఆటో ప్రమాదం.. 10 మందికి గాయాలు
సంతకవిటి మండలం బొద్దూరు గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. పాల ఆటో, ప్రయాణికుల ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చీపురుపల్లి మండలం జి. అగ్రహారం గ్రామానికి చెందిన చందక దుర్గమ్మ, పాటివాడ సురేష్‌, సి. పుష్పలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. పోలీసులు ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్