చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం, గవర్నర్‌కు ఫిర్యాదు

1చూసినవారు
చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం, గవర్నర్‌కు ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. అసైన్డ్‌ భూముల కుంభకోణం, మద్యం కుంభకోణం కేసులను మూసివేయించుకోవడాన్ని తప్పుపట్టారు. ఫిర్యాదుదారులైన అధికారులను బెదిరించి, ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని, దర్యాప్తు సంస్థలు సైతం సహకరిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని నిలువరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాలను తెలిపారు.

సంబంధిత పోస్ట్