చీపురుపల్లి పసుపుమయం… సీఎం రాకకు ఘన స్వాగత ఏర్పాట్లు

3చూసినవారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకతో చీపురుపల్లి పట్టణం వేడుక వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రజా వేదిక కార్యక్రమం సందర్భంగా పట్టణమంతా పసుపు జెండాలతో అలంకరించబడింది. ముఖ్యమంత్రి నేడు రావివలసలో జరగనున్న ప్రజా వేదికకు విచ్చేస్తున్నారు. ఆయన ప్రయాణించే లావేరు రోడ్డుమీద నుంచి సభా ప్రాంగణం వరకు పసుపు జెండాలు ఏర్పాటు చేశారు. చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు స్వాగతం పలుకుతూ పచ్చని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్