విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు, ప్రజలు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కశింకోట వేదాపండితులు శ్రీరామనుజాచార్యులు, గర్భాం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు, ప్రజలు, యువత ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.