గరివిడి: వేప చెట్టు నుంచి పాలు.. ఆసక్తిగా తిలకిస్తున్న జనం

4చూసినవారు
గరివిడి మండలం బొండపల్లి గ్రామ సమీపంలో ఒక వేప చెట్టు నుంచి తెల్లటి ద్రవం (పాలను పోలి ఉండే పదార్థం) కారుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింత దృశ్యాన్ని చూడటానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, చెట్టుకు గాయం అయినప్పుడు లేదా తొర్రలో పగుళ్లు ఏర్పడినప్పుడు, రక్షణ చర్యగా ఇలాంటి తెల్లటి, చిక్కటి రెసిన్ విడుదల చేయడం సాధారణమేనని కొందరు చెబుతున్నారు.