ఆటో ఢీకొని వ్యక్తి మృతి

0చూసినవారు
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
చీపురుపల్లి–గరివిడి రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయరాంపురం గ్రామానికి చెందిన రేగిడి రామూర్తి (55) మృతిచెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రామూర్తిని ఎదురుగా వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామూర్తికి భార్య, పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you