విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో విశ్వబ్రాహ్మణ కులస్తులకు కేటాయించిన స్మశాన వాటిక నిర్లక్ష్యానికి గురవుతోంది. సుమారు 1500 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ, స్మశాన వాటికకు సరైన రహదారి, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో కుల పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘంలో ఎవరైనా మరణిస్తే తప్ప స్మశాన వాటిక గుర్తుకురాని పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని కుమ్మరి కాలనీకి సమీపంలో వేపల చెరువు వద్ద ఈ స్మశాన వాటిక ఉంది. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.