వైసీపీ పార్టీ కార్యకర్తలు ఐడెంటిటీ కార్డు వెరిఫికేషన్ చేయాలి

476చూసినవారు
వైసీపీ పార్టీ కార్యకర్తలు ఐడెంటిటీ కార్డు వెరిఫికేషన్ చేయాలి
వైస్సార్ పార్టీ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, యువనాయకురాలు బొత్స అనూష పిలుపు మేరకు చీపురుపల్లి మండలం అలజంగి, మెట్టపల్లి గ్రామాల్లో వైస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ, చీపురుపల్లి నియోజకవర్గంలో వైస్సార్ పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల ఫోటో వెరిఫికేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.