దూరమైన కుమారుడిని కలిపిన పోలీసులు

3చూసినవారు
దూరమైన కుమారుడిని కలిపిన పోలీసులు
విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామానికి చెందిన పైడి రాజు, ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎస్పీ దామోదర్ రావు ఆదేశాల మేరకు పోలీసులు అతడి ఆచూకీపై దృష్టి సారించారు. గద్వాల్ జిల్లా ఐజా మండలంలో ఉన్నట్లు గుర్తించిన ఎస్ఐ నారాయణరావు, గురువారం పైడి రాజును తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడిని తిరిగి కలిపినందుకు పోలీసులు చేసిన సహాయానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్