శనివారం భోగాపురం పంచాయతీ పరిధిలోని అప్పన్నపేట చెరువుగట్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దానాలపేటకు చెందిన దానాల గోవిందరావు (34) మృతి చెందాడు. భోగాపురం నుంచి ముక్కాం వైపు వెళ్తున్న వ్యాన్, ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో గోవిందరావు అక్కడికక్కడే మరణించాడు. డెంకాడ మండలంలోని అక్కివరం సమీపంలో జామతోటలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే గోవిందరావుకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.