రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

15చూసినవారు
రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
శనివారం భోగాపురం మండలం అప్పన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డి. గోవిందరావు (34) అనే యువకుడు మృతి చెందాడు. ముంజేరు నుంచి భోగాపురం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా, వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. గోవిందరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి. పాపారావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్