కేంద్ర సహకారంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడికి

0చూసినవారు
రావివలసలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉన్నట్టుగా పరిస్థితి ఉండేదని, ఇప్పుడు క్రమంగా మెరుగుపడుతోందన్నారు. ఈ పునరుద్ధరణలో కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చిందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కూటమికి ప్రజలు ఆశీర్వాదం అందించడంతో ఢిల్లీలో రాష్ట్ర పరపతి పెరిగిందని, ప్రస్తుతం అమలు చేస్తున్న “సూపర్ సిక్స్” పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రం మనదేనని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్