శుక్రవారం చీపురుపల్లి సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది లేదా తోటి ఖైదీలు వివక్షత చూపకూడదని, అందరూ సమాన హక్కులు కలిగిన పౌరులేనని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వివరించారు.