పొలం పనుల్లో విషాదం.. ట్రాక్టర్ ప్రమాదంలో విద్యార్థి మృతి

0చూసినవారు
పొలం పనుల్లో విషాదం.. ట్రాక్టర్ ప్రమాదంలో విద్యార్థి మృతి
మెరకముడిదాం మండలం పులిగుమ్మి గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. బెజవాడ కృష్ణ తన పొలాన్ని దున్నుతుండగా, అతని కుమారుడు జస్వంత్ (13) ట్రాక్టర్‌పై కూర్చున్నాడు. పొలం గట్టు ఎక్కే సమయంలో ట్రాక్టర్ ఇంజన్ బోల్తాపడటంతో జస్వంత్ ఇంజన్ కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి. బుదరాయవలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు, దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్