బూడిపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి మృతి

814చూసినవారు
బూడిపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి మృతి
గజపతినగరం మండలం బూడిపేట గ్రామానికి చెందిన మజ్జి పెంటయ్య బుధవారం మృతి చెందడం స్థానికంగా విషాదం కలిగించింది. ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న పెంటయ్య విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఆయన తల్లి పైడితల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.