గజపతినగరంలోని మదీనా మసీదులో గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే ముస్లింలు మసీదుకు తరలివచ్చి నమాజ్ చేశారు. మత గురువు పండుగ విశిష్టత, త్యాగం, సోదరభావం గురించి వివరించారు. అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.