
క్లైర్ మజుందార్ చేతికి బయోకాన్ పగ్గాలు
భారత బయోటెక్ రంగ దిక్సూచి అయిన బయోకాన్ సంస్థలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. సంస్థ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్‌షా తన మేనకోడలు క్లైర్ మజుందార్‌ను వారసురాలిగా ప్రకటించారు. 37 ఏళ్ల క్లైర్ ప్రస్తుతం అమెరికాకు చెందిన ఆంకాలజీ పరిశోధన సంస్థ ‘బికారా థెరప్యూటిక్స్’ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 'ఏకైక యజమానిగా సంస్థను సురక్షితమైన చేతుల్లో ఉంచడం నా బాధ్యత. క్లైర్ సామర్థ్యంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది' అని కిరణ్ మజుందార్‌షా తెలిపారు.




