చంపావతి ఉద్ధృతి.. మర్రివలస గ్రామం ఒంటరిదీవి

1164చూసినవారు
ఇటీవలి భారీ వర్షాల కారణంగా చంపావతి నది పొంగిపొర్లడంతో గజపతినగరం మండలం మర్రివలస గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లడం కష్టమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ముగడ రమణమ్మను గ్రామస్థులు మంచంపై మోసుకుంటూ నది దాటించారు. ఏళ్ల తరబడి వంతెన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న గ్రామస్థులు, తమ సమస్యలను మంత్రి కొండపల్లి దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you