రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో బుధవారం పింఛన్లు పంపిణీ అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సూచించారు. జిల్లాతో పాటు వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేయాలని, ప్రజలు కూడా మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు.