గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.