కారు ఢీకొట్టి కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

2చూసినవారు
కారు ఢీకొట్టి కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
గజపతినగరం మండలంలోని మదుపాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గంట్యాడ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎ. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. బొబ్బిలిలో అమ్మవారి పండగ బందోబస్తుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పెదమానాపురం వైపు నుంచి వచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది. గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు 108 వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :