అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న పోలీసులకు ప్రమాదం

4చూసినవారు
అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న పోలీసులకు ప్రమాదం
దత్తిరాజేరు మండలం ఎస్. బూర్జివలస పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రామకృష్ణ, హోమ్ గార్డ్ రాము ప్రమాదానికి గురయ్యారు. మరడాం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద వీరిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్