దత్తిరాజేరు: వ్యాన్, లారీ ఢీ: ఒకరి దుర్మరణం

5చూసినవారు
దత్తిరాజేరు: వ్యాన్, లారీ ఢీ: ఒకరి దుర్మరణం
మర్రివలస కూడలి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం బొలెరో వ్యాన్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. మృతుని వద్ద చిరునామా ఆధారాలు లభించలేదని, ఒడిశాలోని జయపురానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు ఎస్. బూర్జవలస ఎస్సై రాజేష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్