గింజేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

0చూసినవారు
గింజేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం గంట్యాడ మండలం గింజేరు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,34,645 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు బగ్గు అర్చన, మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you