
లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. PIJ కమాండర్ అబూ హమ్‌జా మృతి
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ) కమాండర్ అబూ హమ్‌జా మృతి చెందాడు. హమ్‌జాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని హిజ్‌బొల్లా అనుబంధ అల్-మనార్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.




