
జగన్ పర్యటన అట్టర్ ఫ్లాప్: మంత్రి కొల్లు రవీంద్ర
కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన పూర్తిగా విఫలమైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటించిన ప్రాంతాల్లో రైతులు కనిపించలేదని, పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించి పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. తుపాను వచ్చి తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా సృష్టించారని, ఆయన మాటల్లో నిజం లేదని, కేవలం ప్రభుత్వంపై బురదజల్లేందుకే ప్రయత్నించారని పేర్కొన్నారు.




