గజపతినగరం ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుపై ఒక విద్యుత్ తీగ అకస్మాత్తుగా పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన గమనించిన స్థానిక ఎస్‌ఐ కిరణ్ కుమార్ నాయుడు వెంటనే స్పందించి, బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే పవర్ సప్లై నిలిపివేయడంతో ప్రమాదం నివారించబడింది. అనంతరం అధికారులు అక్కడి ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేశారు.