గజపతినగరం పంచాయతీ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి జరిగిందని నిలదీస్తున్న వార్డ్ మెంబర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన పంచాయతీ పరిధిలో తప్పుడు బిల్లు అప్ లోడ్ చేసి అవినీతికి పోల్పడుతున్నారని జనసేన వార్డు మెంబర్ కలిగి పండు, పంచాయతీ సెక్రెటరీ జనార్దన్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించిన వీడియో వైరల్ అవుతుంది. అదేవిధంగా వీడియోలో పంచాయతీ సెక్రెటరీ నీకు చెప్పనవసరం లేదు అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది.