
రుతుపవనాల రాక ఆలస్యం.. రైతుల్లో ఆందోళన
దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. మే 26న కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసినా, ఆ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. దీంతో రుతుపవనాలు జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. రుతుపవనాల ఆగమనాన్ని ప్రకటించడానికి నిర్దిష్ట ప్రమాణాలు అవసరం, అవి ఇంకా నెరవేరలేదు.




