జయితిలో కార్తీక ఏకాదశి: 24 గంటల శివనామస్మరణతో భక్తి పారవశ్యం

7చూసినవారు
మెంటాడ మండలం జయితి గ్రామంలోని శ్రీ శ్రీ విఘ్నేశ్వర, శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శనివారం ఏకాహం కార్యక్రమం ప్రారంభమైంది. అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు ఈ కార్యక్రమాన్ని ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం వరకు కొనసాగుతుందని భక్తులు తెలిపారు. కార్తీక మాసంలో ఏకాదశి రోజున 24 గంటలు శివనామస్మరణతో గడపడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్