బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరి దేవాలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం తొలి సూర్యకిరణాల వెలుగులో భక్తులు రాజరాజేశ్వరీ దేవి సమేత రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకున్నారు. గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం పరిధిలోని ఈ ఆలయంలో అర్చకులు దూసి శ్రీధర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.