విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యం, చట్టాలపై అవగాహన కలిగి సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఎస్సై సన్యాసి నాయుడు అన్నారు. డెంకాడ మండలం మోపాడ గ్రామంలోని కేజీబీవీ స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి చట్టాలపై జాగృతి కల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.