నవంబర్ 4న శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో మహాన్నదానం

693చూసినవారు
నవంబర్ 4న శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో మహాన్నదానం
విజయనగరంలో వెలసిన శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 4వ తేదీన మహాన్నదానం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. మూడులాంతర్లు సమీపంలోని చదురుగుడి ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుమారు 10 నుంచి 12 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్