ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు తెలుగువారి మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్యే శామ్యూల్ వంటి వారు తెలుగువారి ఐక్యతను ఓర్వలేక విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గజపతినగరం నియోజకవర్గంలోని మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బొండపల్లి మండలం దేవుపల్లిలో కార్యకర్తలతో మమేకమై, తప్పెటగుళ్లు కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.