గజపతినగరం మండలంలో విద్యుత్ అంతరాయం

1198చూసినవారు
గజపతినగరం మండలంలో విద్యుత్ అంతరాయం
విజయనగరం జిల్లా గర్భం 132 కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు కారణంగా, గజపతినగరం మండలంలోని గంగచోళ్లపెంట, పట్రువాడ, కొత్తబగ్గాం, పాతబగ్గాం, బంగారమ్మపేట, భూదేవిపేట, దావాలపేట, బూడిపేట, కొనిస గ్రామాలకు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఎలక్ట్రికల్ ఇంజనీర్ రఘు తెలిపారు. వినియోగదారులు అసౌకర్యం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.