విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు... టీచర్స్ కు మంత్రి అభినందనలు

4చూసినవారు
విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు... టీచర్స్ కు మంత్రి అభినందనలు
విజయనగరం జిల్లా పదో తరగతి పరీక్షల్లో 91.08 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విజయంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. పటిష్ట ప్రణాళిక, సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో మెరుగైన ఫలితాలు సాధించాలని, ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్