బొండపల్లి మండలం దేవుపల్లి-కనిమేరక గ్రామాల మధ్య మంగళవారం రహదారికి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు బొండపల్లి ఎస్.ఐ. మహేష్ తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగిపోవడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.