
బైక్, బొలెరో వాహనం ఢీ.. యువకుడు స్పాట్ డెడ్
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని ఫ్లై ఓవర్ పై బొలెరో వాహనం, బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్టేషన్ ఘనపూర్(M) ఇప్పగూడెం గ్రామానికి చెందిన నవీన్ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందగా, జనగామ(M) శామీర్ పేటకు చెందిన అభిలాష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




