విజయనగరం: ముడిదాం సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొనడంతో ఆటో నుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్‌ను విజయనగరం మహారాజ హాస్పిటల్‌కు తరలించారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.