ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్ రావు సచివాలయాలు తనిఖీ

982చూసినవారు
ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్ రావు సచివాలయాలు తనిఖీ
విజయనగరం, నెల్లిమర్ల పరిధిలోని భోగాపురం మండలంలో గురువారం ముంజేరు, రామచంద్ర పేట, ముక్కాం, చేపల కంచేరు సచివాలయాలను ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని, రికార్డుల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రతి సచివాలయానికి క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ముంజేరు ఆర్ఎస్కేలో పెండింగ్లో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలని హార్టికల్చర్ సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో సచివాలయ అధికారి సీతారామరాజు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్