
హర్మూజ్ జలసంధిపై కొనసాగుతున్న అమెరికా దిగ్బంధనం
హర్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన దిగ్బంధనం కారణంగా ఇరాన్ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. చాబహార్ ఓడరేవు వద్ద భారీగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. వివిధ దేశాలకు చెందిన చిన్న ట్యాంకర్లు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దిగ్బంధనం వల్ల చమురు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. సముద్రంలోనే సుమారు 155 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు నిల్వలు నిలిచిపోయాయి. నిల్వ సామర్థ్యం అయిపోతున్నందున, ఇరాన్ త్వరలోనే చమురు ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉంది.




