గజపతినగరం మండలం మర్రివలస గ్రామస్థులు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ముగడ రమణమ్మను గ్రామస్థులు మంచంపైనే మోసుకెళ్లి నది దాటించారు. ఏళ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న గ్రామస్థుల ఆశలు ఇంకా నెరవేరలేదు. ఈ దుస్థితిపై మంత్రి కొండపల్లి స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.