బాసర యాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో విజయనగరం మహిళ మృతి

5చూసినవారు
బాసర యాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో విజయనగరం మహిళ మృతి
కామారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కంచిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కడియాల రమణమ్మ (55) మృతి చెందింది. ఈ నెల 5న తీర్థయాత్ర కోసం ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన ఆమె, బాసర దర్శనానికి వెళ్తుండగా ఇల్చీపూర్ సమీపంలో బస్సు ఆపినప్పుడు, రహదారి పక్కన నిలిచి ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన రమణమ్మ మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you