బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో శనివారం తాపీమేస్త్రి తాళ్లపూడి అప్పలనాయుడు (35) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది మామిడిచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.