విజయనగరం: బంగారు పతకం సాధించిన విద్యార్థిని

2చూసినవారు
విజయనగరం: బంగారు పతకం సాధించిన విద్యార్థిని
గరివిడి: గరివిడి ఎస్ఎస్ అటానమస్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని సాకేటి రేణుక కల్యాణి సత్తా చాటింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 84 కేజీల విభాగంలో, ఓవరాల్ గా 320 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించింది. రేణుక ప్రతిభను గుర్తించి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఏయూ తరఫున ఎంపిక చేసినట్టు కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ బి. రవి, ప్రిన్సిపల్ డా. ఎ. రామకృష్ణ తెలిపారు.