వంగర: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు

1348చూసినవారు
వంగర: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు
వంగర మండలం మగ్గూరుకు చెందిన చింత భాస్కరరావు, చింత అప్పలనాయుడు శుక్రవారం రాజాం కళాశాలకు బైక్‌పై వెళుతుండగా, వంగర-రాజాం రోడ్డులోని జోడుబందల-కోడిశ మధ్య మలుపు వద్ద రాజాం వైపు నుంచి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్రావు కుడికాలు విరిగిపోవడంతో అతన్ని రాజాం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన తుప్పల కారణంగా ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.