కుమారుడు పుట్టిన 15రోజుల్లోనే యువకుడి మృతి.. కుటుంబంలో విషాదం

0చూసినవారు
కుమారుడు పుట్టిన 15రోజుల్లోనే యువకుడి మృతి.. కుటుంబంలో విషాదం
గజపతినగరం మండలం మరుపల్లి ఓలమ్ కంపెనీ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన చొక్కాపు శేఖర్‌రావు (29) మృతిచెందాడు. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్‌రావు మరణించాడు. రెండేళ్ల క్రితం వివాహమైన శేఖర్‌కు 15 రోజుల క్రితమే కుమారుడు జన్మించాడు. ఈ ఘటన ఆనందంగా ఉన్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్